Veera Simha Reddy: జై బాలయ్య నినాదాలతో రచ్చ రచ్చగా ‘వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్!
Veera Simha Reddy Pre Reelase Event on Full Swing: నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న వీర సింహా రెడ్డి చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. . మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్ లతో అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహిస్తోంది. ఇక ఈ ఈవెంట్ కోసం బాలకృష్ణ హైదరాబాద్ నుంచి ఒంగోలులు హెలికాఫ్టర్ లో వెళ్లారు. హెలికాఫ్టర్ లో ఒంగోలు చేరుకున్న బాలయ్య, శ్రుతిహాసన్ కు అక్కడి వారు ఘన స్వాగతం పలికారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు పోటెత్తగా జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. ఇక ఇప్పటికే బాలయ్యకు అనేక స్లొగన్స్ ఉండగా ఈసారి అభిమానులు మరిన్ని కొత్త స్లొగన్స్ తో ఆకట్టుకున్నారు. యోగాలో ఆసనం.. మా బాలయ్య మాట శాసనం, ఊదరా శంఖం.. బాలయ్య ఫ్యాన్స్ ఎవ్వరికి జంకం సంక్రాతి కోడిపుంజు.. మా బాలయ్య మనసు చల్లని ముంజు లక్స్ సబ్బు.. బాలయ్య బాబు లబ్బు టూటీ ఫ్రూటీ మా బాలయ్య బాబు క్యూటీ అమ్మ, అయ్యా .. మాస్ కు మొగుడు మా బాలయ్య అంటూ కొత్త స్లొగన్స్ తో వారు ఆకట్టుకున్నారు.