Veera Simha Reddy: బాలయ్య ‘వీర సింహారెడ్డి’ రివ్యూ
Veera Simha Reddy Review: బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా నేడు రిలీజైంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా లో.. సీమ నేపథ్య కథాంశాలు బాలయ్య కెరీర్‌కు అచ్చొచ్చాయి. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో నటించడం బాలయ్యకు కొత్తేమి కాదు. ఒకవిదంగా చెప్పాలంటే ఫ్యాక్షనిజం తో రూపొందిన సినిమాలతోనే బాలయ్య కు మరింత క్రేజ్నిచ్చాయి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి, సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్‌గా నిలవడమే కాకుండా బాలకృష్ణకు మాస్‌లో తిరుగులేని ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. చాల కాలం తర్వాత ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ చేసిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం.
కథ
ఇస్తాంబుల్లో తన తల్లితో కలిసి ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు జై (బాలకృష్ణ). అక్కడే పరిచయమైన ఈషా (శ్రుతి హాసన్)తో పెళ్లి నిశ్చయం అవుతుంది. అప్పటిదాకా జైకి తన తండ్రి గురించి ఏమీ తెలియదు. తన ప్రేమ విషయాన్నీ తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో చెప్తాడు.. జై (బాలకృష్ణ) తండ్రి చనిపోయాడని అనుకుంటాడు. కానీ తల్లి బ్రతికే ఉన్నదని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురవుతాడు. ఫ్యాక్షన్, పగలు, ప్రతీకారాలు లేకుండా సీమలో శాంతి నెలకొనాలన్నది వీరసింహారెడ్డి సంకల్పం. ప్రజలందరి తరఫున తాను ఒక్కడే కత్తి పట్టి పోరాటం చేస్తుంటాడు. వీరసింహారెడ్డిని చంపాలని అతడు చెల్లెలు భానుమతితో (వరలక్ష్మి శరత్‌కుమార్) పాటు ఆమె భర్త ప్రతాప్‌రెడ్డి (దునియా విజయ్) ప్రయత్నిస్తుంటారు. కూమారుడు జై పెళ్లి విషయమై వీరసింహారెడ్డి ని ఇస్తాంబుల్ కి రమ్మని మీనాక్షి కబురు పెడుతుంది. అందుకు వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ కి పయనమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న చెల్లెలు భానుమతి భర్త ప్రతాప్‌రెడ్డి ని తన అన్నను చంపమని పంపిస్తుంది. మరి ఆ దాడి నుంచి వీరసింహారెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడా.. ఇంతకీ ప్రతాపరెడ్డితో అతడి వైరం ఏంటి? చెల్లెలు అన్న చావును ఎందుకు కోరుకుంటుంది ..? మరి ఈ పోరాటంలో జై తన తండ్రి కోసం ఏం చేశాడు? భార్య బిడ్డలకు దూరంగా వీరసింహారెడ్డి ఎందుకు జీవిస్తున్నాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
యాక్షన్ సీన్లు.. డైలాగులు మాత్రమే సరిపోతాయా? ఎంతో కొంత విషయం ఉన్న కథ.. కొంచెం వైవిధ్యం ఉన్న కథనం.. కొన్ని కొత్త సీన్లు ఉండాలి కదా? కానీ గోపీచంద్ ఒక ఫాన్స్ గా మాత్రమే ఈసినిమాను తెరకెక్కించడం విశేషం. ఇంతకు ముందు బాలయ్య సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమాలు చేసిన ఇందులో కొంచం కొత్తదనాన్ని చూపించాడు. ఫ్యాక్షనిజాన్ని ఫారిన్ కంట్రీకి తీసుకెళ్లిన ఘనత కూడా బాలయ్యకే దక్కుతుంది. వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో నటించిన బాలయ్య బాబు ఎప్పటిలాగే తన నటనతో తన మాస్ యాక్టింగ్ తో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. మామూలుగా సీమ నేపథ్యంలో సినిమా అంటే హీరో ఇక్కడే ఉండి శత్రువుల తలలు నరుకుతాడు. కానీ ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య ఫారిన్ కంట్రీలో అడుగు పెట్టి అక్కడ కూడా శత్రువులకు తన కత్తి పదును చూపిస్తాడు. ఈ మధ్య బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యాడు. ఆ సినిమాలన్నింట్లో కథ.. ఆయన పాత్రలు ఒకే రకంగా ఉంటాయి. ముందుగా ఒక యంగ్ బాలయ్యను చూపిస్తారు ఆతరవాత అసలు హీరో ఎంటరవుతాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. కానీ బాలయ్య ఈ సినిమాకొచ్చేసరికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడనే చెప్పాలి. ఎక్కడ తన ఇతర సినిమాలకు పోలిక లేకుండా ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. జగన్ ప్రభుత్వానికి పరోక్షంగా గట్టిగా తాకే కొన్ని డైలాగులు బాగా పేలాయి. థియేటర్లలో జనాలు ఆ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి.
ఇక ఈ సినిమాలో నటించినా కన్నడ నటుడు దునియా విజయ్ తన వైల్డ్ నటనతోఅదరగొట్టాడు. ఈ సినిమాతో దునియా విజయ్ మరి కొన్ని సినిమాలలో బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ‘క్రాక్’ సినిమాలో జయమ్మ గా మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్..మరోసారి భానుమతి పాత్రలో చెలరేగిపోయింది. హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు న్యాయం చేసింది. హనీ రోజ్ ను ఈ సినిమాలో బాలయ్య కి తల్లిగా చేయడం కొందరికి నచ్చలేదు.. గ్లామర్ గర్ల్ ను తీసుకొచ్చి బాలయ్య కీ తల్లిగా చేయడం ఏంటని పెదవి విరుస్తున్నారు. హనీ రోజ్ ఈ సినిమాలో ఉన్నారంటే ఉన్నారు అనిపించారు. ఏమాత్రం స్కోప్ లేదనే చెప్పాలి.
ఇక బాలకృష్ణ, శృతిహాసన్ రొమాంటిక్ లవ్ ట్రాక్‌తో రొటీన్‌గా సినిమా మొదలవుతుంది. కామెడీ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. వీరసింహారెడ్డి ఎంట్రీ తర్వాతే అసలు కథలోకి వెళ్లారు దర్శకుడు. వీరసింహారెడ్డి, ప్రతాప రెడ్డి పగ, ప్రతీకారాలతో ఫస్ట్ హాప్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్.. అక్కడొచ్చే ట్విస్టు ఆకట్టుకుంటాయి.
అన్నయ్యపై భానుమతి పగ పెంచుకోవడానికి గల కారణాల్ని చూపిస్తూ సెకండాఫ్ నడుస్తుంది. సెకండాఫ్ మొత్తం కుటుంబ బంధాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్ గోపీచంద్. చెల్లెలే హీరో మీద పగతో రగిలిపోవడానికి కారణమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి తప్పితే.. ఫ్లాష్ బ్యాక్ ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ మాత్రంసూపర్బ్ అని చెప్పొచ్చు. అయితే అక్కడక్కడ రాసిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగాలేదు. సంగీత దర్శకుడు థమన్ మరోసారి చెలరేగిపోయాడు. చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే ‘మాస్ ఆఫ్ వీరసింహారెడ్డి’