OTT: వీరసింహారెడ్డి ఓటీటీ రైట్స్ ఎవరికి దక్కాయో తెలుసా ?
Veera Simha reddy digital rights by Disney hot star
వీర సింహారెడ్డి థియేటర్లలో సందడి చేస్తున్నాడు. అభిమానులను అలరిస్తున్నాడు. జనాలను థియేటర్లు రప్పిస్తున్నాడు. కొన్ని వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్నాడు. అఖండ సినిమాను దక్కించుకున్న డిస్నీ హాట్ స్టార్ సంస్థే వీర సింహారెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.ఓటీటీలో ఎప్పటి నుంచి సందడి మొదలు కానుందనే విషయం త్వరలోనే డిస్నీ సంస్థ వెల్లడించనుంది.
అఖండ సినిమా 2021 చివర్లో విడుదల అయింది. బాలయ్య ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కోట్లు కొల్లగొట్టాడు. థియేటర్లలో అదరగొట్టిన అఖండ ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది.అత్యధిక స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది.
కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని ఓటీటీలో విఫలమయ్యాయి. ఉదాహరణకు కాంతార సినిమా. తక్కువ బడ్జెట్ తో తెరికెక్కిన కాంతార సినిమా కోట్లు కొల్లగొట్టింది. థియేటర్లలో కోట్లాది మందిని అలరించింది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.అఖండ సినిమా ఇటు థియేటర్ల ప్రేక్షకులను అటు ఓటీటీ ప్రేక్షకులను కూడ అలరించింది.వీర సింహారెడ్డి సినిమా కూడా అదే బాటలో నడవనుందా అనే విషయం మరి కొన్ని వారాల్లో తేలనుంది.