ఈ మధ్య ప్రతి క్రేజీ స్టార్ సినిమాల కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ముందే కర్చీఫ్ వేసేస్తున్నాయి. థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డీల్స్‌ని పూర్తి చేసుకుంటున్నాయి. భారీ ఆఫర్లు ఇస్తూ స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్గా గత వారం థియేటర్లలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు చాలా వరకు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో నెల రోజులు తిరక్కుండానే స్ట్రీమింగ్కు రెడీ అయిపోయిన విషయం తెలిసిందే.
Gandeevadhari Arjuna:ఈ మధ్య ప్రతి క్రేజీ స్టార్ సినిమాల కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ముందే కర్చీఫ్ వేసేస్తున్నాయి. థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డీల్స్‌ని పూర్తి చేసుకుంటున్నాయి. భారీ ఆఫర్లు ఇస్తూ స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్గా గత వారం థియేటర్లలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు చాలా వరకు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో నెల రోజులు తిరక్కుండానే స్ట్రీమింగ్కు రెడీ అయిపోయిన విషయం తెలిసిందే. పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` ఓటీటీలో నెల తిరక్కుండానే స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన `భోళా శంకర్` కూడా ఇదే తరహాలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన `గాండీవధారి అర్జున` కూడా స్ట్రీమింగ్ కానుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందించిన స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ `గాండీవధారి అర్జున`. సాక్షి వైద్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం ఆగస్టు 25న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
వరుణ్ తేజ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటించిన ఈ మూవీ అత్యధిక శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంది. కృష్ణుడి లాంటి వ్యక్తి ఆదేశాలను పాటిస్తూ అర్జున్ వర్మ అనే వ్యక్తి తన వాళ్లని ఎలా కాపాడుకున్నాడు?..సదరు ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు?..చివరికి ఎలా విజయం సాధించాడనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ని సొంతం చేసుకుని మెగా ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తానికి రైట్స్‌ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ తాజా టాక్ నేపథ్యంలో నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ మొదలు పెడుతుందా? ..లేక ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నుంచి ఎనిమిది వారాలు వేచి చూస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఈ సినిమాలోని కీలక పాత్రల్లో నాజర్, విమరలా రామన్, వినయ్ రాయ్ తదితరులు నటించారు.