Kabzaa Trailer: కేజీఎఫ్ ను మించిన ‘కబ్జా’ ట్రైలర్
Kabzaa Trailer: ఉపేంద్ర, కిచ్చ సుదీప్ ‘కబ్జా’ అనే ప్యాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్.చంద్రు దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్. సుదీప్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, కబీర్ సింగ్ దుహా, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మూవీ ట్రైలర్‌ను విడుదల చ్చేసారు మేకర్స్.
1945లో జరిగిన కథగా ఈ చిత్రాన్ని మలిచారు. విజువల్స్ అన్నీ కేజీఎఫ్ సినిమా తరహాలో ఉన్నాయి. మ్యూజిక్, యాక్షన్స్ సీన్స్, డైలాగ్స్, ఎలివేషన్స్, డార్క్ థీమ్ తో ట్రైలర్ ఆసక్తిరేపుతోంది. ట్రైలర్ చూస్తుంటే కేజీఎఫ్ ను మించిన స్థాయిలో కనిపిస్తుంది. చరిత్ర ఎప్పుడు తెగి పడిన తలల కంటే ఆ తలల్నితీసిన చేతుల్నే పొగుడుతుంది. ఓ సామ్రాజ్య నిర్మాణం.. నరికే కత్తితో కాదు. ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం అంటూ ట్రైలర్‌లో డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్ర సమర యోధుడు కొడుకు మాఫియా వరల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. తర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ట్రైలర్ ఇపుడు ట్రేండింగ్ లో ఉంది. ఈ నెల 17న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.