Kabzaa Movie Review: ప్రేక్షకుల హృదయాలను ఉపేంద్ర ‘కబ్జా’ చేశాడా
Kabzaa Movie Review: కేజీయఫ్, కాంతారల తర్వాత కన్నడ నుంచి వస్తున్న పెద్ద సినిమాలు దేశంలోని అన్ని భాషల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక రియల్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. ఉపేంద్ర హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన చిత్రాలు తెలుగులో సెన్సేషన్ హిట్ అయ్యాయి. A, ఉపేంద్ర, వంటి సినిమాలు సూపర్ హిట్ గా మిగిలిపోయాయి. మధ్య మధ్యలో వచ్చిన మరిన్ని సినిమాలు సైతం బాగానే ఆడాయి. ఆ సినిమాలతో ఉపేంద్రకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ మధ్యన ఆయన తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి చిత్రాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసి..మరోసారి మెయిన్ లీడ్లో కబ్జా మూవీ లో నటించారు మరి ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఉపేంద్ర ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేశాడా లేదా చూద్దాం.
ఈ సినిమా 1945 నుంచి 1975 మధ్య కాలంలో జరుగుతుంది. ఆర్కేశ్వర్ (ఉపేంద్ర) పైలట్ కావాలనే లక్ష్యంతో ఉంటాడు. అతని తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో మరణిస్తాడు. అర్కేశ్వరుడికి సంకేశ్వరుడనే అన్న కూడా ఉంటాడు. అమరాపురం యువరాణి మధుమతి (శ్రియ), అర్కేశ్వర ప్రేమించుకుంటారు. కానీ అమరాపురం మహారాజు, మధుమతి తండ్రి అయిన వీర బహదూర్ (మురళీ శర్మ) తన కూతురిని రాజ కుటుంబంలోని వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అన్న మరణించడంతో ఆర్కేశ్వర్ కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ భార్గవ్ బక్షి (సుదీప్) అందుకుఎంటరయ్యాడు. అసలు ఆర్కేశ్వర్ కత్తి పట్టడానికి కారణం ఏమిటి అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
అప్పుడెప్పుడో వచ్చిన భాషా నుండి కేజిఎఫ్ సిరీస్ దాకా ఇలాంటి కథలు ఎన్నో ఎన్నోన్నో చూశాం, కానీ కేజిఎఫ్ ని ఆడియన్స్ మెచ్చడానికి ఎలివేషన్స్, మాస్ మూమెంట్స్, హీరోయిజం, టేకింగ్ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అవే ఇక్కడ కూడా రిపీట్ చేస్తే సరిపోతుంది అనుకున్నట్లు టీం ప్రతీ సీన్ లో కేజిఎఫ్ ను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఫస్టాఫ్ కే ఆడియన్స్ నిరాశకు గురైన , కొంచం బెటర్ గా సెకెండ్ ఆఫ్ ఉన్నప్పటికీ మంచి ఆసక్తిని కలిగించేలా క్లైమాక్స్ రన్ అవుతున్న టైంలో సినిమా మిగిలిన కథ పార్ట్ 2 అంటూ ఎండ్ చేసేసాడు.
కేజీయఫ్ తరహా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కేజీయఫ్ తరహా ఎడిటింగ్ ప్యాటర్న్.. ఇలా ఎంత వద్దనుకున్నా అడుగడుగునా కేజీయఫ్ ఫ్లేవర్ తగులుతూనే ఉంటుంది. అదే రీతిలో సినిమా ఉంటె ఆదరిస్తారేమో అనుకున్నారు దర్శకుడు కానీ ఇది కబ్జానా,కేజీయఫ్ అని కొంచం డైలమా మాత్రం కనిపిస్తుంది. ఇక ఉపేంద్ర ఈసినిమాలో నట విశ్వరూపాన్ని చూపించాడు. సుదీప్ శివరాజ్ కుమార్ ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరికివారే సతి అన్నారు నటించేసారు. శ్రియకు మధుమతి రూపంలో మంచి పాత్ర లో నటించింది.
మైనస్ ఏదైనా ఉంది అంటే సినిమాలో సరైన ఎమోషన్స్ సినిమాలో లేకపోవడం అని చెప్పాలి. కథనం ఎలాగో రొటీన్ గా ఉన్నప్పటికీ సరైన సాలిడ్ ఎమోషన్స్ పడి ఉంటే వాటితో అయినా ఈ సినిమా కాస్త ఎంగేజింగ్ గా ఉండేది. కానీ ఈ సినిమాపై ఎంతో ఎక్సపెక్టేషన్ పెట్టుకున్న అభిమానులస్థాయి ని మాత్రం అందుకోలేదు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ ఇక సంగీత దర్శకుడు రవి బసృర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అందరిని కొంతమేరకు ఆకట్టుకుంటుంది. చివరగా ఒక్కమాటలో చెప్పలంటే మొదటిపార్టు మాత్రం ప్రేక్షుకుల మనసులను కబ్జా చేయలేకపోయింది.