Upasana: భారత్ లోనే బిడ్డకు జన్మనిస్తా.. ఉపాసన
Upasana: మెగాఇంటి కోడలు రామ్ చరాన్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్బవతిగా ఉన్నారు. ఆమె గత డిసెంబర్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత రామ్‌చరణ్, ఉపాసన తమ జీవితంలోకి వారసులను ఆహ్వానించబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా డెలివరీ ఇండియాలో చేసుకుంటానని, తన తొలి బిడ్డకి భారత్‌లోనే జన్మనిస్తానని వెల్లడించింది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ని పాట ఆస్కార్ నామినేట్ అయిన సందర్బంగా రామ్ చరణ్ అమెరికా పర్యటలో ఉన్నారు. అక్కడి జరిగిన ఓ షోలో ఉపాసన డెలీవరీ గురించి ప్రస్తావించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ ను ఉపాసన డెలీవరికి అందుబాటులో ఉండాలని కోరాడు. దీనికి ఆస్టన్ ను కూడా ఉపాసన డెలివరీకి అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉపాసన డెలీవరీ అమెరికాలో జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారానికి ఉపాసన తన ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. తనమొదటి డెలీవరి భారత్ లోనే జరుగుతుందని తెలిపారు.