NBK vsPSPK: ఆసక్తికరంగా అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ప్రోమో!
Unstoppable Promo: తన సినిమా ప్రమోషన్స్‌లోనే ఎక్కువగా కనిపించని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్టుగా రావడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. బాలా అని పిలవమని అందరితో చెబుతుంటాను అని ప్రోమోలో బాలయ్య అంటే నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నా మీరున్నారా? అని పవన్ కళ్యాణ్ అడగడంతో ఇవే పాలిటిక్స్ వద్దని అంటున్నా అని బాలయ్య కౌంటర్ వేయడం ఆసక్తికరంగా మారింది. అలాగే మీ అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి?.. వద్దని అనుకున్నవి ఏంటి? అని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టడంతో ఆ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక రాష్ట్రంలో మీకు ఫ్యాన్ కాని వారు ఎవ్వరూ లేరు కదా?.. మరి ఆ ప్రేమ అంతా కూడా ఓట్లుగా ఎందుకు మారలేదని అనుకుంటున్నారు? అని అడగడంతో పవన్ సమాధానాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అలా ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రోమోలో ఎక్కువగా పవన్ ను ఇరికించే ప్రశ్నలే వేసినట్టు కనిపిస్తోంది. ఇక ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్ రిలీజ్ చేసిన టైంలో ఆహా కొన్ని గంటల పాటు క్రాష్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొత్తం ఎప్పుడు రిలీజ్ అవుతోందో చూడాలి మరి.