Trivikram:తెలుగు సినిమా మునుపెన్నడూ లేనంతగా 69వ జాతీయ అవార్డుల్లో మెరిసింది. జాతీయుత్తమ నటుడు పురస్కారంతో పాటుమొత్తం 11 అవార్డుల్ని వివిధ విభాగాల్లో దక్కించుకునిచరిత్ర సృష్టించింది. అంతే కాకుండా `పుష్ప` సినిమాకు గానూ హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకుని తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
Trivikram:తెలుగు సినిమా మునుపెన్నడూ లేనంతగా 69వ జాతీయ అవార్డుల్లో మెరిసింది. జాతీయుత్తమ నటుడు పురస్కారంతో పాటుమొత్తం 11 అవార్డుల్ని వివిధ విభాగాల్లో దక్కించుకునిచరిత్ర సృష్టించింది. అంతే కాకుండా `పుష్ప` సినిమాకు గానూ హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకుని తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దీంతో అల్లు అర్జున్‌పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బన్నీని ప్రశంసల్లో ముంచేస్తున్నారు.
ఈ సందర్భహంగా మాటల మాంత్రకుడు త్రివిక్రమ్షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ` అల్లు అర్జున్‌గారు సాధించిన ఈ విజయం నాకు ఆశ్చర్యాన్నికలిగించలేదు. ఆయన జాతీయ అవార్డుని కైవసం చేసుకోవడంతో పాటు ఈ ఘనత సాధించిని మొట్ట మొదటి తెలుగు నటుడిగా నిలవడంగర్వంగాఉంది. అల్లు అర్జున్ గారిని దగ్గరి నుంచిచూసిన వ్యక్తిగా పాత్రలకు ప్రాణం పోయడం పట్ల ఆయన చూపే శ్రద్ధాశక్తులు, అసమానమైన అంకిత భావం,అభిరుచిస్పష్టంగా తెలుసు.
అతని అసాధారణమైన ప్రతిభను,నిబద్ధతను గుర్తించే మరిన్ని పురస్కారాలతో అలంకరించబడిన భవిష్యత్తు దగ్గరలోనే ఉంది` అంటూ బన్నీపైతనకున్న ప్రేమను ప్రదర్శిస్తూఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశారు దర్శకుడు త్రివిక్రమ్.అంటే కాకుండా 69వజాతీయ పురస్కారాల్లో సత్తా చాటిన తెలుగు టెక్నీషియన్లని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అభినందలు తెలియజేశారు. కమర్శియల్ పాటలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ స్వరకర్త ఎం.ఎం. కీరవాణి గారు `ఆర్ ఆర్ ఆర్` వంటి స్మారక చిత్రానికి గానూ ఒకే ఏడాది అటు ఆస్కార్, ఇటు జాతీయ పురస్కారం గెలుచుకోవడం అభినందించదగ్గ విషయం.
వెండితెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన దృశ్యకావ్యం ఆర్ ఆర్ ఆర్ కు పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ అవార్డు పొందిన కాలభైరవ,శ్రీనివాస మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్ లకు అభినందనలు. ముఖ్యంగా మన తెలుగు సినిమా కీర్తిని జాతీయ,అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గారికి అభినందనలు` అని తెలిపారు.