హీరో నాగ చైతన్య కారును అడ్డుకున్న పోలీసులు.. ఎందుకంటే ?
అక్కినేని నాగ చైతన్య కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ లో చై కారును అడ్డుకున్నారు. గత కొన్నిరోజులుగా నిబంధనలు ఉల్లంఘించి కారులకు బ్లాక్ ఫిల్మ్ పెట్టి తిప్పుతున్న కార్లపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ ఆర్లను అడ్డుకొని బ్లాక్ ఫిల్మ్ తొలగించిన పోలీసులు తాజాగా చై కారును అడ్డుకొని బ్లాక్ ఫీల్మ్ ను తొలగించారు. అంతేకాకుండా రూ. 700 ఫైన్ విధించారు. ఇది కారులో చై కూడా ఉండడంతో అతడే పోలీసులకు జరిమానా కట్టి, ఇంక బ్లాక్ ఫిల్మ్ అంటించానని చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం చైతన్య పలు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.