Tolly wood: సినీ కార్మికుల సమ్మె వల్ల సినిమాలపై ప్రభావం ఎంత?
Tollywood workers to strike over wages:సినీ కార్మికులకి తెలుగు సినిమా పరిశ్రమకి మధ్య కొత్త సమస్య వచ్చి పడింది. దీనికి కారణం కార్మికుల వేతనాల సవరణను తెలుగు సినీ పరిశ్రమ పట్టించుకోకపోవడం అని తెలుస్తుంది.సినిమా కార్మికులతో వేతనాల సవరణ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా ఛాంబర్ ఆ పని చేయలేదు. ఇక తెలుగు నిర్మాత మండలి, ఫెడరేషన్ సూచనలు, సలహాలు కానీ ఏమాత్రం పట్టించుకొలేదు అని కార్మికుల ఆరోపణ. ఇన్ని జరుగుతున్నా సినీ పెద్దలు మౌనం వహిస్తున్నారని కార్మికుల ఆవేదన. ఈరోజు నుండి షూటింగ్స్ బంద్ చేసిన కార్మికులు ఉదయం నుండే యూనియన్ ఆఫీస్ లకు వెళ్లి స్వచందంగా వారి మద్దతు తెలుపుతున్నారు.ఫెడరేషన్ కార్యాలయం ఎదుట సినీ కార్మికులు నిరసన తెలుపుతూ న్యాయం జరిగేవరకు సమ్మె విరమించేది లేదని పట్టుపట్టారు. ఒక్కపక్క షూటింగ్స్ కి వెళ్లిన వాళ్లకి ఫోన్స్ చేసి మరి వెన్నక్కి రప్పిస్తున్నారు.
ఇక నిర్మాతల మండలి వెర్షన్ మరోలా వినిపిస్తుంది. సమ్మె చేసేముందు ఫిలిం ఛాంబర్‌కు నోటీసులు ఇవ్వాలని.. అలా కాకుండా నేరుగా సమ్మెకు దిగడం ఏమిటని ఫిలిం ఛాంబర్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికే చాలా నోటీసులు ఫిలిం ఛాంబర్ ఇచ్చామని.. అయినా కూడా ఛాంబర్ తమ విన్నపాన్ని పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు ఈ సమ్మె కు పిలుపునిచ్చామని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. 24 విభాగాలకు చెందిన యూనియన్లలో ఒక్కోవిభాగానికి ఒక్కోరకమైన వేతనం ఉంటుంది.లైట్స్ మాన్,మేకప్ మాన్, ఎలక్ట్రీషియన్ ఇలా చూసుకుంటూపోతే అందరు పని చేస్తారు కానీ అందరికి ఒకే వేతనం ఉండదు. ఎలకృషియన్ కి 1500 రూపాయలు మేకప్ మెన్ కి 1500 రూపాయలు జూనియర్ ఆర్టిస్టులకు 800 ఈ విధంగా 6to6 12 గంటలకు పే స్కేల్ వుంటుంది.మళ్ళీ షెడ్యూల్ దాటితే వేరే కాల్ షీట్ కు నిర్మాత డబ్బులు కట్టాలి.దీనికి నిర్మాతలు వ్యతిరేకంగా ఉన్నారు.ఎక్కువ పని తక్కువ వేతనం ఇస్తున్నారు అని వారు ఆవేదన చెందుతున్నారు. 24 క్రాఫ్ట్స్ లలో ..మొత్తం సభ్యులు దాదాపుగా 20,000 మంది వరకు ఉన్నారు. సభ్యత్వం లేని వారు మూడు వేల వరకు వుండొచ్చు అని అంచనా.
ఈ ప్రభావం వల్ల నష్టపోయేది ఒక్కడే అతడే నిర్మాత సినిమా విడుదల ఒక్కరోజు ఆలస్యం అయిన కోట్లలో నష్టం ఇప్పుడు ఈ సమస్య వచ్చినందుకు అయోమయంలో పడ్డారు నిర్మాతలు. ఈరోజు నుండి సమ్మె జరుగుతుండడంతో షూటింగ్స్ కోట్లల్లో నష్టం వచ్చినా సినిమా హిట్ అయితే నిర్మాత కోలుకుంటాడు. మరి మా పరిస్థితి ఏంటి అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇండస్టీలో తుది దశలో ఉన్న షూటింగ్స్, సెకండ్ షెడ్యూల్లో ఉన్న షూటింగ్స్ బాగానే ఉన్నాయ్ అంతే కాదు బాలీవుడ్,కోలీవుడ్ సినిమా షూటింగ్స్ ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.మరి వాటి పరిస్థితి ఏంటిఅనే ఆలోచనలో పడ్డారు మేకర్స్.
చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ కొత్త షెడ్యూల్ మంగళవారమే మొదలైంది. సాయితేజ్ కొత్త సినిమా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15, ప్రభాస్ సాలార్,రవితేజ నటిస్తున్న రావణా సుర,అఖిల్ ఏజెంట్,నితిన్ మాచర్ల నియోజక వర్గం ఈ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతే నష్టం భారీగానే ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమాలలో ఆర్టిస్ట్ ల కాల్షీట్స్ ను సెట్ చేయడం చాల కష్టం.ఇప్పుడు ఈ సమ్మె వల్ల మళ్ళీ ఆ ఆర్టిస్టుల కాల్షీట్స్ సర్దుబాటు చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ సమ్మె పాన్ ఇండియా సినిమాకి తలనొప్పిగా మారింది.
ఇక సెట్స్ పైకి వెళాల్సిన సినిమాలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు టాలీవుడ్ ఒకటే కాదు బాలీవుడ్ ,కోలీవుడ్ చిత్రాలు హైద్రాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసాయి .అజిత్ ,అజయ్ దేవగన్ .షారుక్ ఖాన్ ,శివ కార్తికేయన్ ,ధనుష్ ,సల్మాన్ ఖాన్,విజయ్ ఇలా అగ్ర హీరోల సినిమాలు ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.ఈ షూటింగ్స్ ఒక్కరోజు ఆగిపోతే ఒక్కో సినిమాకి మినిమమ్ 30 నుండి 50 లక్షలవరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది.ఈవిధంగా రోజుకు 5 కోట్లవరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.మరి ఈ సమ్మెపై ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.