Tollywood Cine Workers Strike: రేపటి నుంచి సినిమా షూటింగులు బంద్. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి
Telugu Cine Workers call for a Strike: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(టాలీవుడ్)కు కష్టాలు మొదలయ్యాయి. సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. రేపటి నుంచి షూటింగులకు రాబోమని తేల్చిచెప్పారు. వేతనాలు పెంచే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించారు. ఇన్నాళ్లూ అరకొర జీతాలతో వెట్టిచాకిరీ చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ పై మరింత ఒత్తిడి తేనున్నామని తెలిపారు. ఈ మేరకు రేపు ఉదయం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. 24 యూనియన్ల సభ్యులు ఏకగ్రీవంగా ఈ ప్రకటన చేయటం గమనార్హం.
కార్మికులు మూకుమ్మడిగా సమ్మె బాట పట్టడంతో రేపటి నుంచి సినిమాల చిత్రీకరణలు దాదాపు నిలిచిపోనున్నాయి. సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికులు మరింత మంది మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. తమకు సపోర్ట్ చేయాలని వివిధ వర్గాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. అసలే కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమ మళ్లీ ఇబ్బందులపాలు కాకూడదంటే తక్షణమే కార్మికులను చర్చలకు పిలవాలి. సమ్మెను విరమింపజేయాలి. షూటింగులు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి.