Tolly wood: రేపటి నుండి నిలిచిపోనున్న తెలుగు సినిమా షూటింగ్స్
Telugu Films To Stop Shoots From Tommarow: చలనచిత్ర ఇండస్టీలోనే మొట్టమొదటిసారిగా నిర్మాతలు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కు పిలుపునిచ్చాయి. ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా చిత్రీకరణలు అన్ని నిలిచిపోనున్నాయి. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు అలాగే సినిమా కార్యక్రమాలు ఏవి జరపకూడదని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది.
ఈరోజు జరిగిన ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపాడు. ఇందులో బడా నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలు కూడా భాగస్వామ్యం కానున్నారు.ఇప్పటికే చాలా సినిమాలు విడుదలతేదిని ప్రకటించి శెరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్న సమయంలో నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల సినిమా విడుదల తేదీలు క్లాష్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది.
ఈ నిర్ణయం అందరం కలిసి ఇష్టపూర్వకంగా తీసుకున్నదే అని దిల్ రాజు తెలిపాడు. ప్రతి ఒక్క నిర్మాత వారి వారి షూటింగ్ లను నిలిపివేస్తున్నారు. జనరల్ బాడి మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూర్చొని చర్చలు జరుపుతాం. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఇదే నిర్ణయంపై ఉంటాం అని తెలిపారు.
షూటింగ్ దశలో ఉన్న అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా ఆగిపోనున్నాయి,చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్,బాలకృష్ణ – గోపీచంద్ మలినేని మూవీ,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు,శంకర్- రాంచరణ్ చిత్రం,నాని దసరా, పుష్ప 2 సినిమాల పై పెద్ద ప్రభావం పడనుంది. మరి ఇప్పటికే ఈ సినిమాల విడుదల తేదీలు ప్రకటించిన మేకర్స్ మళ్ళీ ఇప్పుడు మరో తేదికి మార్చుతారని సమాచారం.