Tollywood: ముదిరిన వివాదం నిలిచిన షూటింగ్స్ రంగం లోకి సినీపెద్దలు
Telugu Film Federation strike: టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె ప్రకటించారు. దీంతో నిన్నటి నుండి అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ సమ్మెపై తాజాగా నిర్మాతల మండలి స్పందించింది. ప్రత్యేకంగా సమావేశమైన నిర్మాతల మండలి. మీటింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్ మాట్లాడుతూ ఇలా సమ్మె చేయటం తప్పని, తమకు వేతనాలు పెంచటానికి అభ్యంతరం లేదని, అయితే కార్మికులతో చర్చించాల్సిన విషయాలున్నాయని ఆయన అన్నాడు.
కార్మికులతో పని చేపించుకుంటున్నాం వారి పొట్ట కొట్టడం మాకు నచ్చదు.కానీ కొంతమంది యూనియన్ నాయకులూ వారి స్వార్థం కోసం కార్మికులను వాడుకుంటున్నారు.యూనియన్ ఉచ్చులో పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు.ఈ నిర్ణయం పై కమిటీలో చర్చించాలి.ముందుగా మాకు నోటీసు ఇచ్చి మీరు సమ్మెకు వెళ్ళాలి కానీ మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సమ్మెకు వెళ్లడం మంచిపద్దతి కాదన్నాడు. రేపటినుంచి కార్మికులంతా యధావిధిగా షూటింగ్స్‌లో పాల్గొనాలి. అందరం కలసి షూటింగ్స్ జరిగేలా చూద్దాం. ఎప్పటిలాగా షూటింగ్స్‌కి వస్తే శుక్రవారం చర్చించి ఒక పరిష్కార మార్గానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే నిర్మాతలెవరూ షూటింగ్స్ చేయడానికి సిద్ధంగా లేరు.వేతనాలపై 2018లో ఒప్పందం చేసుకున్నామన్నాడు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దని.. సినిమా కార్మికులు హాజరుకాకపోతే మేమే షూటింగ్ లు ఆపేస్తామని మరో ఆరు నెలలపాటు సినిమాలు చేయము అప్పుడు మీకు అర్ధమవుతుంది నష్టపోయేది ఎవరని. నిర్మాతలను ఇబ్బంది పెట్టకండి. వారు సినిమాలు చేస్తేనే మనకు పని ఉంటుందన్నాడు.
దీనిపై కార్మికులు తమ డిమాండ్స్ పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసారు. వేతనాలు 45 శాతం పెంపుదల ఉండాలని డిమాండ్ చేసాడు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. మేం పాత వేతనాలతో షూటింగ్స్‌కు వెళ్లం 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరవుతాం. పెంచకపోతే ఎన్ని రోజులైనా ఇలాగే సమ్మె కొనసాగిస్తాం అన్నాడు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. ఈ వివాదం నిర్మాతలకు మరో తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.