Sharath babau: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు (Sharath babu) కన్నుమూశారు.
Sharath babau: టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు (Sharath babu) కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నెలరోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG Hospital) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో శరత్ బాబు కన్నుమూశారు.
శరత్ బాబు కొద్దిరోజులుగా వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనికితోడు ఆయన శరీరం మొత్త సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలెయం వంటి అవయావాలు పాడైపోయాయి. ముందుగా కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. నెలరోజులుగా వైద్యులు వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స అందించారు. ఈక్రమంలో సోమవారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో అయన తుదిశ్వాస విడిచారు.
శరత్ బాబు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాధ చాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు.. రామరాజ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడంతో పాటు మొత్తం 250కి పైగా సినిమాల్లో శరత్ బాబు నటించారు. హీరోగానే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు పాత్రల్లో నటించి మెప్పించారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో కూడా శరత్ బాబు నటించారు. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో శరత్ బాబు చివరి సారిగా నటించారు.
రేపు శరత్ బాబు అంత్యక్రియలు
శరత్ బాబు మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. కడసారి షరత్ బాబును చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. మంగళవారం షరత్ బాబు మృతదేహాన్ని చెన్నై తరలించనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.