తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే కారణాన్ని సుస్మితా సేన్ వివరించింది.తన పెళ్లికి తాను దత్తత తీసుకున్న పిల్లలే కారణమని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టి పడేసింది.
Susmithasen: బాలీవుడ్ నటి , మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Susmithasen) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 29 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న సుస్మిత..47ఏళ్ల వయసులోనూ అదే గ్లామర్ మెయిన్టెయిన్ చేస్తుందంటారు ఆమె ఫ్యాన్స్. అయితే తను ఇంతవరకూ పెళ్లి చేసుకోకుండానే సోలో బతుకే సో బెటరంటూ బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ సినీ లవర్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ పంచుతూనే ఉంటుంది.
మరోవైపు సుస్మితా సేన్ పెళ్లి కాకపోవడానికి(not married) తను దత్తత తీసుకున్న పిల్లలే(Adopted children) కారణమని..అందుకే తను ఇంకా పెళ్లి చేసుకోవడం లేదన్నవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే కారణాన్ని సుస్మితా సేన్(Susmithasen) వివరించింది.తన పెళ్లికి తాను దత్తత తీసుకున్న పిల్లలే(Adopted children) కారణమని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టి పడేసింది.
తాను మూడు సార్లు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యానని.. కానీ దేవుడు తనను, తన పిల్లల్ని రక్షించాడని సుస్మితా సేన్ చెప్పుకొచ్చింది. తన లైఫ్లో కొంతమంది ఇంట్రెస్టింగ్ మగాళ్లను కలిశానని చెప్పిన మాజీ మిస్ యూనివర్స్(Former Miss Universe)… వాళ్లంతా నిరాశపరచడంతోనే తాను పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. అంతే కానీ తన ఇద్దరి పిల్లల వల్ల కాదంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.