Upcoming Movies In Theaters: ఈ వారం థియేటర్లలో ,ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు
Upcoming Movies In Theaters & Ott: గత సంవత్సరంవిడుదల కావాల్సిన సినిమాలు ఈ సంవత్సరం విడుదల అవుతున్నాయి. ఆలస్యమైన సినిమాలు అన్నీ ఒకదాని వెనుకమరోటి రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు పోటీగా ఓటీటీలో కూడా చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గత వారం థియేటర్లో విరాటపర్వం, గాడ్సే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘విరాటపర్వం’ పరవాలేదనిపించినా ‘గాడ్సే’ మాత్రం విజయంకోసం ఎదురుచూస్తునట్టుంది. ఇక ఈ వారం కూడా చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. ఇందులో కొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంటే… మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘కొండా’ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా… త్రిగుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘శ్రేష్ట పటేల్ మూవీస్’ బ్యానర్ పై కొండా సుష్మితా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జూన్ 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది.
కిరణ్ అబ్బవరం , చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’ ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘యుజి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కె.ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.అలాగే పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి,నటించిన ‘చోర్ బజార్’ కూడా జూన్ 24నే విడుదల అవుతుంది.జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుండడం విశేషం.
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 7 డేస్ 6 నైట్స్ ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ సమర్పణలో సుమంత్ అశ్విన్,రజనీకాంత్ఎస్ నిర్మించారు. జూన్ 24న ఈ చిత్రం కూడా విడుదల కాబోతోంది.అలాగే పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్, ఆశీమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు విన్నర్ వినోద్ విజయన్ దర్శకత్వం వహించాడు. 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.అలాగే ‘వలయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన లక్ష్ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు 24నరాబోతున్నాడు. ఇక ఈ చిత్రాలతోపాటు షికారు,సదా నన్ను నడిపే,పెళ్లి కూతురు పార్టీ లు విడుదలవుతున్నాయి.
సినిమాలు థియేటర్లలో ఎలా సందడి చేయబోతున్నాయో అలాగే ఓటీటీలో కూడా సందడి మొదలైంది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట మంచి విజయం సాధించింది. ఇక జూన్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాలతోపాటు మరికొన్ని చిత్రాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. తమిళ చిత్రం ఖాతిర్,మన్మథ లీల చిత్రాలు జూన్ 24 నుండి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘కుట్టావుమ్ శిక్షావుమ్’ జూన్ 24 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.