Oscar Awards 2023: మరికొద్దిగంటల్లో ప్రారంభం కానున్న ఆస్కార్ వేడుక
Oscar Awards 2023: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి తరువాత అయన దేశఎల్లలనే కాదు ఖండాతరాలు దాటి అయన ఖ్యాతి విస్తరించింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కు ప్రపంచదేశాలనుండి ప్రశంసల వెల్లువను కురిపిస్తుంది. ఈ సినిమా లోని ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని ఉత్కంతంగా ఎదురుచూస్తున్నారు భారతదేశ ప్రజలు. ఇప్పటికే ఎనో అవార్డులను సొంతం చేసుకున్న ఈ ఆర్ఆర్ఆర్ ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలవనుంది.
అందరి దృష్టీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే పడింది. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లలో నిలవడంతో ఏం జరుగుతుందోనే ఉత్కంఠ నెలకొంది. ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య తన ఓటు హక్కు ను
తాజాగా వినియోగించుకున్నారు. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. ఈ ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ ఈవెంట్ కోసం అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ఇప్పటికే సిద్దమయ్యింది. ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటబోతుంది.
ఇప్పటికే ఈ నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ సైతం అందుకుంది. అమెరికాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తి కర విషయాలను పంచుకుంటున్నారు టీమ్.