ముఖ్యమంత్రి స్టాలిన్ చేతులమీదుగా తమిళ్ ఆహా లాంచ్..
ఆహా.. 100% వినోదంతో అలరిస్తున్న ఓటిటీ సంస్థ.. బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, డబ్బింగ్ చిత్రాలతో పాటు స్పెషల్ టాక్ షోలు, గేమ్ షోలతో ప్రేక్షకుల వినోదానికి ఎటువంటి లోటు లేకుండా డిజిటల్ రంగంలో నెంబర్ వన్ గా నిలిచింది ఆహా. ఎప్పటికప్పుడు సబ్ స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతోన్న ఈ ఓటిటీ ఇకనుంచి తమిళ్ లో కూడా వినోదాన్ని పంచనుంది. ఆహా ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ఆహా యాజమాన్యం ప్రయత్నిస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగానే తొలి అడుగుగా ఆహాను తమిళ్ లో లాంచ్ చేయనున్నారు మేకర్స్. 2022 పొంగల్ సందర్భంగా ఆహా తమిళ్ ఓటీటీ ని లాంచ్ చేస్తున్నట్లు నిర్వాహకులు అల్లు అరవింద్ మరియు మై హోమ్ రామ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.
ఇక తాజాగా నేడు గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు M.K. స్టాలిన్ చేతులమీదుగా ఆహా తమిళ్ ఓటీటీ ని లాంచ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నయ్ లీలా ప్యాలెస్ లో ఈ వేడుక ఘనంగా జరుగుబోతోంది. రాబోయే రోజుల్లో తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషల నుండి అనువదించిన సినిమాలను, వెబ్ సీరిస్ లను, ఓటీటీ మూవీస్ ను కూడా తమిళ ఆహాలో ప్రసారం చేయబోతున్నారు. మరి తెలుగులో అనతికాలంలోనే టాప్ 1 పొజిషన్ కి వెళ్లిన ఆహా .. తమిళ్ ఓటిటీలను తట్టుకొని అక్కడ కూడా టాప్ 1 పొజిషన్ కు వెళ్తుందేమో చూడాలి.