TFPC Elections: ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్.. ఆ ఇద్దరి బహిష్కరణ!
TFPC Elections: ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ ఉంటాయని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ పేర్కొన్నారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉంది, అది ఎప్పుడు బాగుండాలి అని మా కోరిక అని పేర్కొన్న కళ్యాణ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, 19 ఉదయం ఎలక్షన్స్ సాయంత్రం కౌంటింగ్ అదే రోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని అన్నారు. ఇక TFPC కమిటీ పై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారని ఎలక్షన్స్ కోసం ఒక పది మంది సభ్యులు టెంట్ లు వేశారని ఆయన అన్నారు. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోమని అన్నారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదన్న ఆయన మా కౌన్సిల్ లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉంది ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం… దాసరి నారాయణ రావు గారేనని అన్నారు. మా సభ్యులలో కె సురేష్ బాబు ని మూడు సంవత్సరాలు, యలమంచిలి రవిచంద్ ను జీవిత కాలం బహిష్కరిస్తున్నామని పేర్కొన్న ఆయన కొందరు పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు. అవి ఏవీ TFPCలో భాగం కాదని అన్నారు. ఇక నంది అవార్డుల కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నామని, ఆంధ్రలో నంది అవార్డులు, తెలంగాణ లొ సింహ అవార్డులు త్వరగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే మా ఫిలిం ఇండస్ట్రీ తరపున అవార్డులు మేమే ఇస్తామని అన్నారు.