Gargi Review: తండ్రి కోసం పోరాటం చేసిన ‘గార్గి’ అందరిని మెప్పించిందా?
Sai Pallavi Gargi Movie Review: సాయి పల్లవి ‘విరాట పర్వం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. సాయి పల్లవి చుట్టూ సౌత్ ఇండస్టీ లో ఉన్న ప్రొడ్యూసర్స్ కాల్ షీట్స్ కోసం ఎదురుచూసే టైమ్ వచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో మొదటి స్థానం లో ఉంటుంది సాయి పల్లవి. తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో ముందుకు వచ్చింది. ఈ చిత్రం సినీ ప్రేమికులను మెప్పించిందా?లేదా ? ఇప్పుడు చూద్దాం.
గార్గి కథ నెల్లూరులో జరుగుతుంది, అక్కడ గార్గి (సాయి పల్లవి) తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతు టీచర్ జాబ్ చేస్తుంది.తండ్రి ఓ అపార్ట్ మెంట్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు.ఓ రోజు రాత్రి అపార్ట్ మెంట్ లో జరిగిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో గార్గి తండ్రిని అరెస్ట్ చేస్తారు. తండ్రి అరెస్టు కావడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తన తండ్రిని ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకుందామని స్టేషన్‌కు వెళుతుంది. ఆమె తండ్రిని ఉద్దేశపూర్వకంగా ఇరికించారాని తెలుస్తుంది. గార్గి న్యాయం కోసం పోరాటం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి ఆటుపోట్లని ఎదుర్కొంది. తండ్రిని నిర్దోషి గా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాల్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రమిది. ఆడపిల్లలకు అడుగడుగునా వివక్ష, వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయనే అంశాన్ని చర్చిస్తూ ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు. కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు నేరారోపణ గావించబడిన ఓ కుటుంబానికి సమాజం నుండి ఎదురయ్యే అవమానాల్ని జోడించిదర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు.
గార్గి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది ముఖ్యంగా ఎమోషనల్ నటన పేక్షకులను కట్టిపడేస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు. గౌతమ్ రామచంద్రన్ ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు. అయితే సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, తండ్రి కుమార్తె మధ్య భావోద్వేగాలను తెరపై అద్భుతంగా ప్రదర్శించాడు.
మైనస్ పాయింట్స్ : కథని నిదానంగా నడిపించడం సినిమాకు మైనస్‌గా నిలిచింది. ఆర్ట్ సినిమా మాదిరిగా ప్రతీ సీన్ నత్తనడకన సాగుతుంది. తండ్రిని నిర్దోషిగా నిరూపించడం కోసం గార్గి చేసే పోరాటాన్ని ఆసక్తికరంగా చెప్పలేకపోయారని సగటు ప్రేక్షకుడి ఆవేదన.
కాస్త ఓపిగ్గా చూస్తే హృదయాన్ని కదిలించే సన్నివేశాల్ని సాయి పల్లవిలోని గొప్ప నటిని చూడొచ్చు.వినోదం అనే అంశాలు పక్కన పెట్టి చూస్తే సినిమా అందరికి నచ్చుతుంది.