TATA binge: టాటా ప్లే బింజ్ కొత్త ఆఫర్ గురించి మీకు తెలుసా?
Tata Play Binge Mobile Pro Monthly subscription costs Rs 199
భారతదేశంలో ఓటీటీ మార్కెట్ శరవేగంగా విస్తరించింది. కరోనా వ్యాప్తికి ముందు నుంచి ఉన్న ఓటీటీలు కరోనా రాకతో ఊపందుకున్నాయి. కోవిడ్ విజృంభించిన సమయంలో కోట్లాది మంది ప్రజలు ఓటీటీ (ఓవర్ ది టాప్) బాట పట్టారు. తమకిష్టమైన షోలను ఇంట్లోనే కూర్చుని వీక్షించారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం రావడంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీ ప్లేయర్ల సంఖ్య కూడా పెరిగింది.
25 ఓటీటీ సంస్థల కంటెంట్
టాటా ప్లే బింజ్ మొబైల్ ప్రో నెలవారీ చందాను 199 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి 25 ఓటీటీ సంస్థల కంటెంట్ ఈ విధానం ద్వారా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టాటా ప్లే డీటీహెచ్ కస్టమర్లకు కూడా బింజ్ అందుబాటులోకి ఉంటుంది.
మొబైల్ ఫోన్ తో పాటు, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ వెర్షన్లకు కూడా ఇదే చందా వర్తించనుంది. నెలవారీ చందాతో పాటు 3 నెలలు, సంవత్సరం చందా విధానం కూడా అందుబాటులో ఉంది. నెలకు 199 రూపాయలు కాగా..3 నెలలకు 569 రూపాయలు, సంవత్సరానికి 2189 రూపాయలు చందా వసూలు చేస్తున్నారు.