Oscar Promotions: తమ్మారెడ్డి భరద్వాజపై దర్శకేంద్రుడు ఫైర్, కారణం ఇదేనా
Tamma reddy comments on RRR Oscar Promotions creates controversy
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆస్కార్ ప్రమోషన్ల కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుబట్టారు. ఆ 80 కోట్లు మాకిస్తే ఓ 8 సినిమాలు చేసి ముఖాన కొడతామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు కొందరు సినీ ప్రముఖులకు కూడా కోపం తెప్పించాయి.
ఒక తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తుంపు లభిస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజపై మండిపడుతున్నారు. తెలుగు సినిమాకు, తెలుగు దర్శకుడికి, తెలుగు హీరోలకు అంతర్జాతీయ వేదికపై లభిస్తున్న ఆదరణను చూసి గర్వపడాలి గానీ ఇలా ఈర్శ పడడమేంటని ఫైర్ అవుతున్నారు.
దర్శకేంద్రుడు రాఘేవేంద్రరావు సైతన తమ్మారెడ్డి భరద్వాజను ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ‘మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?అంటూ రాఘవేంద్ర రావు తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023
Oscar Promotions