Vijay antony: హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం, మలేషియా నుంచి చెన్నై తరలింపు
Tamil Hero Vijay antony health condition is critical, admitted in Chennai Hospital
మలేషియాలో షూటింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స అందిచడానికి హుటాహుటిన చెన్నై తరలించారు.
మలేషియాలో షూటింగ్ జరిగిన సమయంలో తమిళ హీరో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. పళ్లు విరిగిపోయానని, దవడ పగిలిందని, ముఖానికి కూడా తీవ్రంగా దెబ్బలు తగిలాయని వార్తలు గుప్పుమన్నాయి.
హీరోయిన్ కావ్యాథాపర్ తో కలిసి ఓ బోటులో పైటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్ బోడ్ డ్రైవ్ చేస్తున్న విజయ్ అదుపుతప్పాడు. ఎదురుగా ఉన్న పెద్ద బోటును ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. గాయం తీవ్రంగా తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కావ్యాథాపర్ చిన్న చిన్న గాయాలతో బయటపడింది.
మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోనీ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు. అరుదైన అవార్డులను సైతం దక్కించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. అక్కడ కూడా ఊహించని విజయం సాధించాడు. బిచ్చగాడు అనే సినిమా ద్వారా తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.
బిచ్చగాడు సినిమా కలెక్షన్ల పరంగా కూడా భారీ విజయం సాదించింది. దీంతో విజయ్ క్రేజ్ అమాంతంగా పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలు చేస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మలేషియాలో జరిగిన ప్రమాదం విజయ్ ను కోలుకోని దెబ్బ తీసింది.