JrNtr:అసురన్ దర్శకుడితో యంగ్ టైగర్ సినిమా ?
JrNtr: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసుకుంటున్నాడు . త్వరలోనే తారక్ హీరోగా కొరటాల శివ,ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నారంటూ పలు రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే పనితో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్..
మరో వైపు పాన్ ఇండియా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు.కె.జి.ఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతుంది. ఈ సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడట.
ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఎన్టీఆర్ ఓ తమిళ్ దర్శకుడి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. రీసెంట్‌గా ఆ దర్శకుడు ఎన్టీఆర్‌ను కలిసి కథను వినిపించారని టాక్. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చటంతో కథను సిద్ధం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆడుగలం,విశారణై చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన వెట్రిమారన్ ఆ తర్వాత రూపొందించిన వడ చెన్నై, అసురన్ వంటి చిత్రాలు వరుస విజయాలను అందుకున్నాడు . డైరెక్టర్‌గానే కాదు మరో వైపు రైటర్‌గానూ కొన్ని సినిమాలకు ఆయన వర్క్ చేస్తున్నాడు. ముందుగా సూర్యతో వాడివాసల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆ తర్వాత తారక్‌తో సినిమా చేయడానికి ప్లాన్ సిద్ధం చేసాడు వెట్రి మారన్ .
ఇప్పటికే రెండు పెద్ద ప్రాజెక్ట్ సినిమాలకు ఓకే చెప్పేసిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసిన తర్వాతే వెట్రిమారన్ సినిమాను ట్రాక్ ఎక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఇంత వరకు వెట్రిమారన్ తెరకెక్కించిన ఒక్క సినిమా కూడా పరాజయం పాలవలేదు.అసురన్ చిత్రంలో ధనుష్ ను విభిన్నమైన కోణం కోణం లో చూపించిన ఘనత ఈ దర్శకుడికే చెల్లింది. మరి ఇప్పుడు తారక్ ను ఏ విధంగా చూపిస్తాడో వేచి చూడాలి.