Dhanush: మరో న్యాయమూర్తికి బదిలీ అయిన ధనుష్ కేసు
Dhanush: సూపర్ స్టార్ అల్లుడిగా మాత్రమే కాకుండా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ధనుష్..గత మూడేళ్లకిందట హీరో ధనుష్ కోర్టు చిక్కులో ఇరుక్కున్నాడు. ధనుష్ మా కొడుకేనంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. సినిమాలపై ఆసక్తితో చినప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయాడని కోర్ట్ కు తెలిపారు.
ఈ కేసులో భాగంగా ధనుష్ బర్త్ సర్టిఫికేట్ ని చూపించాలని కోర్టు ఆదేశించగా.. ధనుష్ వాటిని సమర్పించాడు. దీంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది. సమస్య సమసి పోయిందని అనుకున్న టైం లో కదిరేశన్ దంపతులు ధనుష్ చూపించిన సర్టిఫికేట్లు నకిలీ పత్రాలని, అతడిపై కేసు నమోదు చేయాలనిమరోసారి కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఈ కేసుని స్వీకరించింది..అప్పటినుండి ఈ కేసు పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ పిటిషన్‌ను మరో న్యాయమూర్తికి బదిలీ చేసి జాబితాలో చేర్చాల్సిందిగా మదురై బెంచ్ ఆదేశించింది.