Sharwanand: ఇరవై ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను చూసాను..శర్వానంద్
Sharwanand: కొందరు మాస్ సినిమాలతో జనాలకు దగ్గరైతే మరికొందరు క్లాస్ సినిమాలతో దగ్గర అవుతారు. కానీ కొందరు మాత్రమే తమ సినిమాలోని వైవిధ్యత వల్ల దగ్గర అవుతారు. ఆ వరుసలో శర్వానంద్ ముందుంటారు. 2004లో కెరీర్ మొదలెట్టినప్పటి నుండి ఇప్పటివరకు శర్వానంద్ అలాగే తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న శర్వా తనదైన శైలిలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఇరవై ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ వెండి తెరపై అందరిని అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో ఇరవై సంవత్సరాల స్నేహం, కష్టాలు ఎత్తులు,చిరునవ్వులు ఎన్నో మరెన్నో..అచంచలమైన ప్రేమ మరియు మరియు మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినా మీ అందరికి ధన్యవాదాలు. నా ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి అంకితం. ఇరవైసంవత్సరాల క్రితం ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది .ఈ సినీలోకంలో న ‘గమ్యం’ ఎంతో దూరం మిమల్ని అలరించడం కోసం ప్రతి క్షణం ‘రన్ రాజా రన్’ లా పరుగులు తీస్తూనే ఉంటాను కృషి చేస్తూనే ఉంటాను ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే అశీసులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను అని శర్వానంద్ నటించిన కొన్ని సినిమాలపేర్లు యాడ్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు.
20 years of a wonderful journey in a wonderful world called Cinema.
Cherishing every moment and blessing, which came along the way.
Thank you. pic.twitter.com/4ejEemqEOI
— Sharwanand (@ImSharwanand) March 6, 2023