Balakrishna: ఇకచాలు ఆపేయండి మేము మేము ఒకటి..ఎస్వీరంగారావు మనవళ్ళు
Balakrishna: బాలకృష్ణ అక్కినేని,ఎస్వీరంగారావు పై చేసిన వ్యాఖ్యలపై వాళ్ళ అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన అక్కినేని తొక్కినేని అంటూ అలాగే ఎస్వీ రంగారావు వ్యాఖ్యలపై ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అక్కినేని అభిమానులు నిరసన చేపట్టారు.
అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన మనవడు నాగచైతన్య ఖండించారు. మనమంతా కలిసిఉండాలి మనల్నిమనమే కించపరచుకోకూడదని ట్వీట్ చేసారు. దీంతో అభిమానులు సీరియస్‌గా రియాక్ట్ అవ్వగా.. ఎస్వీ రంగారావుపై చేసిన కామెంట్స్‌పై కాపు నేతలు తీవ్రంగా స్పందించారు. బాలయ్య బహిరంగ క్షమాపణ చెప్పల్సిందే అంటూ పట్టుపడుతున్నారు.
ఇదిలాఉండగా ఎస్వీరంగారావు పై చేసిన కామెంట్స్ పై అయన మనవళ్లు స్పందించారు. ఆయన ఓ సందర్భంలో ఇలా మాట్లాడివుంటారు..కానీ బాలకృష్ణ కు మా కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. అయన మాట్లాడింది తోటి నటులతో ఉద్దేశించి అని అన్నారు. ఈ విషయంలో మాకు బాలయ్య కు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇక ఈ వివాదానికి తెరదించండి. మా కుంటుంబానికి ఎస్వీరంగారావు కుటుంబానికి ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టదని వారు స్పందించారు.