Hero Suriya: దుర్భర పరిస్థితుల్లో శివపుత్రుడు సినిమా నిర్మాత, ఆర్ధిక సాయం చేసిన హీరో సూర్య
Suriya makes a generous help to Pithamagan producer VA Durai
హీరో సూర్య తన మంచి మనసును చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న సినీ నిర్మాత వీఏ దురైకు ఆర్ధిక సాయం చేశారు. చికిత్సకు తక్షణ అవసర నిమిత్తం 2 లక్షల రూపాయలు అందించారు. రానున్న రోజుల్లో కూడా ఆర్ధికంగా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నిర్మాత వీఏ దురై గతంలో అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. సూర్య, విక్రమ్, సత్యరాజ్ వంటి హీరోలతో సినిమాలు నిర్మించారు. 2003లో వచ్చిన శివపుత్రుడు సినిమాకు వీఏ దురైయే నిర్మాత కావడం విశేషం. ఆ సినిమా ద్వారా హీరో సూర్య, హీరో విక్రమ్ లకు మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
విక్రమ్, సూర్య నట జీవితంలో మైలురాయిగా నిలిచేపోయే శివపుత్రుడు సినిమాను నిర్మించిన దురై ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. చికిత్స చేయించుకోడానికి కూడా డబ్బులు లేని దుర్భర పరిస్థితిలో ఉన్నారు. తన పరిస్థితిని వివరిస్తూ సాయం కావాలని వేడుకున్నారు. కొందరు స్నేహితులు ఓ వీడియో రూపొందించారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం హీరో సూర్యకు చేరడంతో వెంటనే స్పందించి ఆర్ధిక సాయం అందించారు.
• @Suriya_offl has come in support of his 'Pithamagan' producer and reportedly handed over him a cash of Rs 2 lakh for VA Durai's initial treatment @rajsekarpandian | @singamgroup8 pic.twitter.com/b5Syr6c91h
— Vishnu Suriya Karthi ™️ (@Vishnusuriyatcr) March 6, 2023
Actor @rajinikanth's #Baba movie executive producer VA Durai has released a video asking for financial help. The man doesn't even have funds to treat his illness.
People who know his bank account or any other details, please share, guys. We shall do our best.#Varisu #Leo pic.twitter.com/JWGjtooz1X
— Raja Gopal (@rajagopalmani) March 6, 2023
Siriya