Bigg Boss 7:వరల్డ్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. తొలి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభించారు. ఆ తరువాత సెకండ్ సీజన్‌ని నేచురల్ స్టార్ నానితో నడిపించారు. మూడవ సీజన్ వచ్చేసరికి హోస్ట్ సీట్‌లోకి కింగ్ నాగార్జున వచ్చి చేరారు.
Bigg Boss 7:వరల్డ్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. తొలి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభించారు. ఆ తరువాత సెకండ్ సీజన్‌ని నేచురల్ స్టార్ నానితో నడిపించారు. మూడవ సీజన్ వచ్చేసరికి హోస్ట్ సీట్‌లోకి కింగ్ నాగార్జున వచ్చి చేరారు. షోని మరింత అందంగా మలిచి టాప్ రేటింగ్‌ని అందించి మరింత పాపులర్ అయ్యేలా చేశారు. సీజన్ 3 నుంచి హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగార్జున తాజాగా సీజన్ 7కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 3 నుంచి సీజన్ 7 ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి వెళ్లే వారికి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతూ బిగ్ బాస్ షోపై ఆసక్తిని పెంచేస్తోంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్‌గా నిలిచి నిర్వాహకులని షాక్‌కు గురి చేసిన కారణంగా సీజన్ 7ని మరింత కొత్తగా, మరింత భిన్నంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో సీజన్ సెవెన్ ఉల్టాపుల్టా అంతా రివర్స్ అంటూ నాగ్ చేప్పిన డైలాగ్‌లు ఈ సారి సీజన్ కొత్తగా ఉంటుందనే సంకేతాల్ని అందిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో హౌస్‌లోకి వెళుతోంది ఎవరు?..ఎవరెవరు రాబోతున్నారు? అనే చర్చ జరుగుతోంది. మరో ఐదు రోజుల్లో సెప్టెంబర్ 3న సీజన్ 7 ప్రారంభం కానున్న నేపథ్యంలో కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత కూడా హౌస్‌లోకి ప్రవేశిస్తున్నారంటూ వరుస కథనాలు మొదలయ్యాయి. తొలి సీజన్ నుంచి వీరి పేర్లు వినిపిస్తున్నా ఏ సీజన్‌లోనూ వీరు హైస్‌లోకి అడుగు పెట్టలేదు.
దీంతో ఇవన్నీ వట్టి పుకార్లేనని తేలింది. తాజా సీజన్ ప్రారంభం కానున్న సందర్భంగా మరోసారి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీతల పేర్లు మరోసారి వార్తల్లో నిలవడంతో ఈ సారైనా హౌస్‌లోకి తల్లీ కూతుళ్లు ఎంట్రీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం లేదని, వీరిపై వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదని తెలిసింది.