Gunashekar: గుణశేఖర్ కూతురు పెళ్లి వేడుకలో సూపర్ స్టార్, ఐ కాన్ స్టార్ ..ఒకే వేదికపై
Gunashekar: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు పెళ్లి రిసెప్షన్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదికపై ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఫోటోలు దిగారు. ఇందులో అల్లుఅర్జున్ గారాలపట్టి ‘అర్హ’ కూడా హాజరైంది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కాగా మహేష్ బాబు గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’, ‘సైనికుడు’ వంటి సినిమాల్లో నటించాడు. అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాని,రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ తెరకెక్కించగా.. ప్రెజెంట్ ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ వెండితెర అరంగేట్రం చేస్తుంది. రుద్రమదేవి సినిమా లో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి గా తన నటనతో అందరిని మెస్మరైజ్ చేసాడు.
#MaheshBabu and #AlluArjun together at #Gunasekhar's daughter @neelima_guna wedding reception today.@Gunasekhar1 @GunaaTeamworks pic.twitter.com/DRVkSZYNLG
— Sreedhar Sri (@SreedharSri4u) December 11, 2022