Sundeep kishan Michael Trailer: బాలయ్య విడుదలచేసిన ‘మైకేల్’ ట్రైలర్
Sundeep kishan Michael Trailer: సందీప్ కిషన్ సినిమా సినిమాకు తనపంథాను మారుస్తూ వెళుతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమానుండి సందీప్ సరైన కథలను ఎంచుకుని ఇండస్టీలో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మైకేల్’ ఈ సినిమా ట్రైలర్ నేడు బాలకృష్ణ చేతులమీదుగా విడుదల చేసారు. ట్రైలర్ ను చూస్తుంటే ఫుల్ యాక్షన్ సినిమా అని అర్ధమవుతుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది.
రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ పరిశ్రమలో కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు సందీప్. ఈ మూవీలో హీరోయిన్ గా మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్, తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్ వార్స్ కి ప్రేమ కథని జోడించి దర్శకుడు ఒక స్టోరీని రెడీ చేసుకున్నాడు దర్శకుడు. ఈ ట్రైలర్ మాత్రం చుస్తే అలానే అనిపిస్తుంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.