ధీర.. ధీర.. ఓ సుల్తానా .. కెజిఎఫ్ 2 నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్
యావత్ సిని అభిమానులంతా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. హోంబోలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కెజిఎఫ్ చాప్టర్ 1 లో ధీర.. ధీర.. ఓ రణధీరా అంటూ సాగిన పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఇక ఈ పాటకు కంటిన్యూగా చాప్టర్ 2 లో ధీర.. ధీర.. ఓ సుల్తానా అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ హీరోను ఎలివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఆర్ఆర్ఆర్ లా ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..