మరో రీమేక్ ని మొదలుపెట్టిన అక్షయ్ కుమార్..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో రీమేక్ మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం అక్షయ్, సుధా కొంగర డైరెక్ట్ చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం విదితమే, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. హీరో సూర్యలోని పరిపూర్ణమైన నటుడిని సుధా కొంగర ఆవిష్కరించిన విధానం సినిమాకు మేజర్ ప్లస్ అయింది.
జి.ఆర్. గోపినాథ్ వాస్తవ జీవిత కథకు కొంత కల్పిత కథనాన్ని జోడించి సుధా కొంగర సినిమాను రూపొందించిన తీరు సౌత్ లో బాగా వర్కవుట్ అయింది. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. అక్కడ కూడా సుధా కొంగరనే దర్శకత్వం వహించడం విశేషం. ఇకపోతే తాజాగా నేడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్లు తెలుస్తోంది.. మరి ఈ సినిమాతో అక్షయ్ మరో హిట్ అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.