Sukanya:ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయాక తరచూ ప్రముఖులపై రూమర్‌లు వినిపించడం సర్వసాధరణంగా మారింది. క్రేజీ స్టార్లతో పాటు వెటరన్ హీరోయిన్‌లపై కూడా క్రేజీ వార్తలు నెట్టింట వైరల్ అవుతూ వారిని వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ సుకన్య వార్తల్లో నిలిచారు.
Sukanya:ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయాక తరచూ ప్రముఖులపై రూమర్‌లు వినిపించడం సర్వసాధరణంగా మారింది. క్రేజీ స్టార్లతో పాటు వెటరన్ హీరోయిన్‌లపై కూడా క్రేజీ వార్తలు నెట్టింట వైరల్ అవుతూ వారిని వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ సుకన్య వార్తల్లో నిలిచారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సుకన్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జగపతిబాబు హీరోగా ఏ.ఎం.రత్నం నిర్మించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన `పెద్దరికం` సినిమాతో సుకన్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఆ తరువాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. చివరి సారి `శ్రీమంతుడు` సినిమాలో మహేష్‌కు తల్లిగా కనిపించారు. ఆ తరువాత ఆమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఐదు పదులు దాటిన వయసులో నటి సుకన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై ఆమె స్పందించారు. `50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లా?` అంటూ ప్రశ్నించారు. ఒక వేళ తాను పెళ్లి చేసుకున్నా పుట్టబోయే పిల్లలు నన్ను అమ్మా అనాలా? లేదా అమ్మమ్మ అని పిలవాలా?` అని ప్రశ్నించారు.
అంతే కాకుండా తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, ప్రస్తుతం తాను చాలా ఆనందంగా ఉన్నానని తెలిపారు. నాకు మంచి ఫ్యామిలీ ఉంది. నన్ను అభిమానించి ఆదరించే స్నేహితులు ఉన్నారు. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు` అన్నారు. నటిగా నాలుగు భాషల్లో బిజీగా ఉన్న సమయంలో నటి సుకన్యకు 2002లో శ్రీధర్ రాజగోపాలన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఏడాది తిరక్కుండానే 2003లో ఆయనతో విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్నే గడుపుతూ సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నారు.
నటిగా సుకన్య నాలుగు భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించారు. అందులో కమల్ హాసన్, శంకర్‌ల కలయికలో రూపొందిన `భారతీయుడు` ఒకటి. ఇందులో సైనాపతి భార్యగా కమల్‌కు తల్లిగా సుకన్య నటన అందరిని ఆకట్టుకుంది. జగపతిబాబు నటించిన `పెద్దరికం`తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సుకన్య ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `సాంబ`, మంచు మనోజ్ `శ్రీ`, ప్రభాస్ `మున్నా`, నందమూరి బాలకృష్ణతో `అధినాయకుడు`, మహేష్ బాబుతో కొరటాల శివ రూపొందించిన `శ్రీమంతుడు` వంటి సినిమాల్లో సుకన్య నటించారు.