World Music Day:ప్రపంచ సంగీత దినోత్సవం
World Music Day:ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21 న జరుపుకుంటారు. మొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ లో జరుపుకున్నారు. దీనిని అప్పటి ఫ్రెంచ్ మంత్రి జాక్ లాంగ్ నిర్వహించాడు. మారిస్ ఫ్లోరెట్ పారిస్ లో ఫెటే డి లా మ్యూజిక్ ను ప్రారంభించాడు . అందుకే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఫెటే డి లా మ్యూజిక్ అంటూ పిలుస్తారు.ఈరోజు సంగీత కళాకారులూ ఉచితంగా వాయిస్తూ తమ విద్యలను ప్రదర్శిస్తుంటారు.
ఇండియాలో శాస్తీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. దీనితో పాటు పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేహం లేదు.
సంగీతం మీతో మాట్లాడుతుంది అవును ఇది ముమ్మాటికీ నిజం ఎప్పుడైనా.. ఎక్కడైనా నీ నీడ నిన్ను విడిపోతుందేమో కానీ సంగీతం మాత్రం నిన్ను వీడిపోదు. చేసేపనిలో నడిచెనడకలో నిద్రపోతున్నప్పుడు ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకునే ఉంటుంది. సంగీతానికి పరవశించని వారు ఎవరు ఉండరు.రాళ్ళని సైతం కరిగించే శక్తి ఒక్క సంగీతానికే ఉంది అలాగే పూర్వపురోజుల్లో ఏదైనా సుస్తీ చేస్తే వారికీ ఆ నొప్పి తెలియకుండా సంగీతం తో నయం చేసేవారు. ఈ మధ్య న కరోనా బారిన పడిన పేషేంట్స్ కి సైతం స్ట్రెస్ ను తగ్గించడానికి ఈ మ్యూజిక్ థెరపీ ని వాడడం విశేషం.
ఇది మ్యూజిక్ డే లేదా మేక్ మ్యూజిక్ డే అని కూడా పిలుస్తారు. సంగీతం కొరకే జరుపుకునే ప్రత్యేకమైన వేడుక ఇది . ఈ సంగీత దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక కళాకారులూ సంగీతాన్ని ప్రదర్శిస్తారు ఈరోజు తమ అభిమాన వాయిద్యాలను బహిరంగ ప్రదేశాలలో వాయిస్తూ సంగీత ప్రియులని ఉత్సాహపరుస్తారు.
భారత దేశములో సంగీతానికి పెద్దపీట వేస్తారు. భాషకు అతీతమైంది సంగీతం ఏ జీవికైనా ఇంపుగా, వినసొంపుగా వుంటుంది. యింతటి నేపథ్యగల భారతీయ సంగీతం సప్తస్వరసహితమైంది. స్వప్తస్వరాలను ‘స, రి, గ, మ, ప, ద, ని,’ అన్నవి. వీటికి సంకేతాలను కూడ నిర్ధారించారు. అవి షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాదాలకు సంకేతాలు అని అర్ధం.మన సమజం లో ప్రముఖ జీవులైన – నెమలి, ఎద్దు, , కోయిల, గుర్రం, వాటి సవ్వడులనుండి మనకు సంగీతం వినపడుతుంది జీవరాసులు సైతం సంగీతానికి పరవశించి నాట్యం చేస్తాయి.
సువిశాల సంగీత ప్రపంచంలో ఎన్నో సంగీతాలు. శాస్త్రీయ సంగీతం, జానపదం, పాప్ మ్యూజిక్.. ఇలా ఎన్నో. ముఖ్యంగా భారతీయ సంగీతాన్ని ప్రధానంగా శాస్త్రీయ సంగీతం, జానపదం, ఆధునిక సంగీతం.. ఇలా మూడు విభాగాలుగా చెప్తారు. మనకు శాస్త్రీయ సంగీతం అంటే మక్కువ ఎక్కువ. అలాగే పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్, వెస్ట్రన్ మ్యూజిక్ వగైరాలను కూడా నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు.సంగీత ప్రపంచానికి ఎల్లలులేవు.
సంగీతం గురించిఎందరో మహానుభావులు వర్ణించారు. అనుభూతిని ప్రకటించారు. సూక్తులను వల్లెవేశారు. ఎంతటి కోలాహలంలోనైనా సంగీతాన్ని వినగలిగే మనుషులు జీవితంలో గొప్పగొప్ప ఫలితాలని సాధించినట్లే. – డా. విక్రం సారాభాయి. పగిలిముక్కలై చెదరిపోయే హౄదయానికి దివ్యమైన ఔషధం సంగీతం. – యం. హంట్. సంగీత సుస్వరాలకి స్పందించని మనిషి, సౄష్టిలోని సున్నితమైన అధ్బుతాలని అందుకోలేడు. షేక్స్ పియర్. ఇలా ఎందరో సంగీతం గురించి వర్ణించారు.