Singer Mangli: హీరోయిన్ గా సింగర్ మంగ్లీ
Singer Mangli: హీరోయిన్ గా సింగర్ మంగ్లీ వెండితెరపై కనపడనుంది..అదేంటి సింగర్ కదా అనే అనుమానం రావచ్చు.. కానీ ఇది నిజం. సింగర్ మంగ్లీ అంటే కేరాఫ్ జానపదం-జనపదం ఎన్నో మంచి పాటలు పాడి కుర్రకారును హుషారెత్తించింది. ధమాకా లో ఈమధ్య మంగ్లీ పాడిన పాట ట్రెండింగ్ స్థాయి లో ఉంది. ఇక అటు ఫోక్,ఇటు సినిమాపాటలు రెండింటిలో తన సత్తా చాటుతుంది. తాజాగా వెండితెరపై హీరోయిన్ గా రాబోతుంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘పాదరాయా’ అనే పాన్ ఇండియా సినిమాలో మంగ్లీ నటిస్తున్నట్లు సమాచారం. 2013 లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నాగ శేఖర్ నటిస్తుండగా హీరోయిన్ గా మంగ్లీ నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు చక్రవర్తి చంద్ర చూడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమధ్య అడపా దడపా సినిమాలలో మంగ్లీ నటించింది. కానీ ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం ఈ సినిమా ఏకంగా ఆరు బాషలలో తెరకెక్కనుందని సమాచారం.