Sruti Haasan:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `సలార్: పార్ట్ 1 సీజర్ ఫైర్`. `కేజీఎఫ్` సిరీస్ సినిమాలతో రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మేకోవర్, యునిక్ స్టైల్ తో.. డార్క్ థీమ్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు.
Sruti Haasan:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `సలార్: పార్ట్ 1 సీజర్ ఫైర్`. `కేజీఎఫ్` సిరీస్ సినిమాలతో రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మేకోవర్, యునిక్ స్టైల్ తో.. డార్క్ థీమ్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా అని ప్రకటించిన దగ్గరి నుంచి `సలార్` ఎలా ఉంటుంది?..ప్రభాస్‌ని ఏ స్థాయిలో తెరపై ఆవిష్కరించబోతున్నాడు? అనే చర్చ అభిమానుల్లో, సినీ లవర్స్‌లో మొదలైంది. అప్పటి నుంచే ఈ సినిమాపై భారీ బజ్ కూడా క్రియేట్ అయి ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ `సలార్`ని రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ని `సలార్: పార్ట్ 1 సీజర్ ఫైర్` పేరుతో సెప్టెంబర్ 28న పాన్ ఇండియా వైడ్‌గా రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ కూడా మొదలైంది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్‌లో ఉండటంతో `సలార్: పార్ట్ 1 సీజన్ ఫైర్` ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని అభిమానులు, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేరు వీరయ్య`, `వీర సింహారెడ్డి` సినిమాలతో ప్రేక్షకులని అలరించిన శృతిహాసన్ ఇదే ఏడాది ముచ్చటగా మూడవ సినిమా `సలార్: పార్ట్ 1 సీజన్ ఫైర్` తో రాబోతోంది. తెలుగులో శృతి చేతిలో ఉన్న అతి భారీ సినిమా ఇదొక్కటే కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విఝయంలోనూ శృతి ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోందట. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ఐదు భాషల్లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతోందట. ఇప్పటికే మూడు భాషలకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసిన శృతి మరో రెండు భాషల డబ్బింగ్‌ని త్వరలో పూర్తి చేయనుందని తెలిసింది. ఈ సినిమా ట్రైలర్‌ని సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.