ఎన్టీఆర్ సరసన అలియా.. డైరెక్టర్ ఏమన్నాడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. ఎన్టీఆర్ 30 గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అలియా భట్ నటిస్తుందని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే.
ఇక తాజాగా ఆ వార్తలపై శివ కొరటాల మాట్లాడుతూ “స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఎన్టీఆర్‌ను చాలా పవర్ ఫుల్ రోల్‌లో చూడబోతున్నారు. నేను ఇప్పటివరకు సినిమాను ఎన్టీఆర్ కి మాత్రమే చెప్పాను. ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఫైనలైజ్ చేయలేదు.దీంతో ఈ ప్రాజెక్టుకి ఆలియా నో చెప్పిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది”. మరి ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి.