Sharuk khan: చరణ్ వస్తేనే ‘పఠాన్’ ప్రమోషన్స్..షారూఖ్
Sharuk khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పఠాన్’. మరో అగ్ర హీరో జాన్ అబ్రహం కూడా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. ఇక షారుక్ ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో షారుక్ వేగం పెంచాడు.
‘పఠాన్’ సినిమాను ఇప్పుడు నేషనల్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షారుక్ కి అభిమానులు భారీగానే ఉన్నారు. సౌత్ లో షారుక్ మార్కెట్ కూడా బాగానే ఉంది. ఈమేరకు ‘పఠాన్’ సినిమాను తెలుగులో కూడా విడుదల కానుంది. కానీ షారుక్ తెలుగు రాష్టాల్లో మూవీ ప్రమోషన్స్ పై పెదవి విప్పడంలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ట్రైలర్ ను చరణ్ షేర్ చేసేలా ఏర్పాటు చేసాడు షారుక్.. అలాగే తమిళంలో విజయ్ చేత షేర్ చేయించారు. ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక ట్రేండింగ్ స్థాయికి వెళ్ళింది. తాజాగా ఓ నెటిజన్ షారుక్ కి ఓ ప్రశ్న వేసాడు. తెలుగు రాష్టాల్లో ‘పఠాన్’ ప్రమోషన్ చేయరా? అని అడిగారు. దానికి సమాధానంగా రామ్ చరణ్ తీసుకెళ్తానంటే ప్రమోషన్స్ కి కచ్చితంగా వస్తా అని బదులిచ్చాడు. ఇక మెగా ఫ్యామిలీతో బాలీవుడ్ కి ఓ మంచి స్నేహబంధం ఉంది. ఆమధ్య అమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకు మెగాస్టార్ ప్రమోషన్ చేసి తెలుగులో విడుదలచేసారు. అలాగే సల్మాన్ ఖాన్ సినిమాకి మెగా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కోవలో షారుక్ కూడా వెళ్తున్నాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు.