RamCharan: శంకర్ సినిమాలో కలెక్టర్ గా కనిపించనున్న రామ్ చరణ్ ?
Ram Charan to play a Collector in Shankar’s film: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘RRR’ తో ప్రపంచ సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. పాన్ ఇండియా విజయాన్ని చరణ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రామరాజు పాత్రలో నటనకు సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. తాజాగా తన కెరియర్ లో 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘RC 15’ వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు సమాచారం.రామ్ చరణ్ సరసన కీయారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.
వీటిలో ఒకటి కలెక్టర్ పాత్ర అని టాక్. ఈ చిత్రంలో సీఎం కొడుకు పాత్రలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నారట. ముఖ్యమంత్రి కొడుకుగా అవినీతి చేస్తున్న ఎస్ జై సూర్య ని… కలెక్టర్ గా ఉన్న రామ్ చరణ్.. అడ్డుకునే రీతిలో అవినీతిని.. అంతమందించే విధంగా శంకర్ ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో కలెక్టర్ పాత్ర చాలా హైలెట్ గా శంకర్ తీర్చిదిద్దినట్లు సమాచారం.
అంతేకాకుండా సినిమాలో చరణ్ ఫైట్ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ నీ తలపించే రీతిలో శంకర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు . ఆగస్టు లో చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాకి సంబంధించి టైటిల్ తో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు సమాచారం వినిపిస్తోంది.