కళావతి సాంగ్ కి సీనియర్ హీరోయిన్ డాన్స్.. వీడియో వైరల్
స్వయంవరం సినిమా తో హీరోయిన్ గా మంచి పేరును గుర్తింపును దక్కించుకున్న తెలుగు అమ్మాయి లయ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు హీరోయిన్స్ కు తెలుగు లో అప్పటి నుండే ఆఫర్లు తగ్గడం మొదలు అయ్యింది. లయ కూడా ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.దీంతో ఒక వ్యాపారవేత్తన పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలో స్థిరపడింది.ఇక ఇటీవల రీల్స్ కారణంగా ప్రతి ఒక్కరు తమలోని టాలెంట్ ని బయటపెడుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈమధ్య సీనియర్ హీరోయిన్లు అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లతో విరుచుకుపడుతున్నారు. కానీ, లయ మాత్రం తనదైన నటనను రీల్స్ ద్వారా అభిమానులకు చూపుతుంది. తాజాగా లయ ట్రెండ్డింగ్ సాంగ్ అయిన సర్కారు వారి పాట కళావతికి డాన్స్ చేసింది. కళావతి హుక్ స్టెప్ ను వేసిన లయ కాస్త క్రియేటివిటీని జోడించింది. ఒకే వీడియోలో రెండు డ్రస్ ల్లో చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా సోలోగా చేయకుండా మరో ఇద్దరితో కలిసి చేసి మెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినతర్వాత కూడా ఆమె అందం దశాబ్ద కాలం క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని, ఇప్పటికి కూడా ఈమెకు హీరోయిన్ గా ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదుఅని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.