సత్యదేవ్ ‘గాడ్సే’గా వచ్చేది ఆరోజే..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారుతున్నాడు. ఒకపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పత్రాలు పోషిస్తునే మరోపక్క హీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఇక సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం గాడ్సే. గోపీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ‘గాడ్సే’ సినిమాను మే 20న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా సత్యదేవ్ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. పోస్టర్ లో సత్యదేవ్ రెండు చేతుల్లో రెండు గన్ లు పట్టుకొని సీరియస్ లుక్ లో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్లు అందుకుంటున్న ఈ హీరో ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.