Satish Kaushik: సతీష్ కౌశిక్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. అండర్ వరల్డ్ లింకులు?
Satish Kaushik Death Case: సినీ నటుడు సతీష్ కౌశిక్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వికాస్ మాలు రెండవ భార్య సాన్వి చేసిన ఫిర్యాదు చర్చనీయాంశం అయింది. దుబాయ్‌లో జరిగిన పార్టీకి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుమారుడు హాజరయ్యాడని మహిళ ఆరోపించింది. సినీ నటుడు సతీష్ కౌశిక్‌కు ఛాతీ నొప్పి వచ్చినప్పుడు మొదటి అంతస్తులోని తన గదిలో ఉన్నాడు. నొప్పి కారణంగా, ఆయన మొదటి అంతస్తు నుండి దిగి తన సొంత పోర్చ్ కారులో కూర్చున్నాడు. ఫామ్‌హౌస్‌లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. అక్కడి డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ బృందం ఆదివారం ఫామ్‌హౌస్‌ను సందర్శించింది.
పార్టీలో దాదాపు 45 నిమిషాల పాటు నటుడు డ్యాన్స్ చేసినట్లు చెబుతున్నారు. 20 నుంచి 22 మంది పార్టీకి హాజరయ్యారు. మూడు గంటలకు ఈ పార్టీ అయిపోయింది. సాయంత్రం ఐదు గంటలకే అందరూ ఫామ్‌హౌస్ నుంచి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. సతీష్ కౌశిక్‌కి మధ్యాహ్నం 12.10 గంటలకు ఛాతిలో నొప్పి వచ్చింది. అనంతరం తన మేనేజర్‌కు సమాచారం ఇచ్చాడు. మేనేజరు సాయంతో తానూ మెట్లు దిగి కిందకు వచ్చాడు. ఇక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ కౌశిక్ గదిలో డయాజిన్ బాటిల్, పెట్ సఫా లభ్యమయ్యాయి. ఇవే కాకుండా రక్తపోటు, షుగర్‌కు సంబంధించిన మందులు కనుగొనబడ్డాయి. అయితే, ఈ మందులు అతని మేనేజర్ వద్ద ఉన్నాయి. నటుడు సతీష్ కౌశిక్ ఒక సినిమా చేయబోతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా డీల్ కోసం వికాస్ మాలుతో మాట్లాడేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లాడని అంటున్నారు.