Pushpa v/s Jai Bhim:ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు,ఇండస్ట్రీ వర్గాలు ఈ క్షణం కోసం ఎదురు చూశారు. మొత్తానికి తెలుగు నటుడికి 70 ఏళ్ల తరువాత జాతీయ పురస్కారం లభించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
Pushpa v/s Jai Bhim:ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు,ఇండస్ట్రీ వర్గాలు ఈ క్షణం కోసం ఎదురు చూశారు. మొత్తానికి తెలుగు నటుడికి 70 ఏళ్ల తరువాత జాతీయ పురస్కారం లభించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. `పుష్ప` సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తయ నటుడిగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు విమర్శకులు, నెటిజన్‌లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనికి అవార్డుల ప్రకటన అనంతరం బన్నీ మీడియాతో అన్నమాటలు ఆజ్యం పోస్తున్నాయి. అల్లు అర్జున్ గారూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది కదా మీడియా ముందుకు ఎలాగూ వచ్చారు. ఒక్క మాట మాట్లాడండి సార్.. అని మీడియా వాళ్లు అడిగే.. `లేదు బ్రదర్.. నేను షాక్‌లో ఉన్నాను` అని మాట్లాడకుండానే బన్నీ లోపలికి వెళ్లిపోయారు. ఇదే మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. బన్నీనే కాదు తనకు అవార్డు వచ్చినందుకు ఇండస్ట్రీ వర్గాలతో పాటు పక్క ఇండస్ట్రీ వారు కూడా షాక్‌లో వున్నారని కామెంట్‌లు చేస్తున్నారు.
అయితే కొంత మంది క్రిటిక్స్, తమిళ నెటిజన్‌లు మాత్రం `పుష్ప` సినిమాపై, బన్నీకి లభించిన నేషనల్ అవార్డుపై విమర్శలు చేస్తున్నారు. పుష్పరాజ్ పాత్రలో బన్నీ అద్భుతంగా నటించాడు. కానీ నేషనల్ అవార్డు లభించేంతగా మాత్రం అతని నటన లేదని కామెంట్‌లు చేస్తున్నారు. హీరో సూర్య నటించిన `జై భీమ్` సినిమాని చూపిస్తూ సూర్య కు రావాల్సింది. ఇందులో ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. అలాంటి సినిమాని, అద్భుతమైన నటుడిని పక్కన పెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీని ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు.
ఏ విభాగంలో చూసినా సూర్య జాతీయ అవార్డుకు అర్హుడని, సూర్య కంటే అల్లు అర్జున్ ఏ విషయంలో గొప్ప నటుడని, జై భీమ్ కంటే `పుష్ప` గొప్ప సినిమానా? ..ఓ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్‌కు జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటని తమిళ తంబీలు ఫైర్ అవుతున్నారు. ఇక `జై భీమ్`లో సోషల్ మెసేస్ ఉందని, `పుష్ప`లో స్మగ్లింగ్ తో పాటు గ్యాంగ్ స్టర్‌గా ఎదిగే క్రమాన్ని చూపించారని దీనికి ఎలా అవార్డు ఇస్తారని తమిళ విమర్శకులు కామెంట్‌లు చేస్తున్నారు.
జాతీయ పురస్కారాలపై ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ ఏవి జాతీయ ఉత్తమ చిత్రాలు అంటూ సెటైర్లు వేశారు. కామెంట్ చేశారు. ఇదే సందర్భంగా సూర్య నటించిన `జై భీమ్` సినిమా గురించి మాట్లాడారు. `పుష్ప` సినిమా పేరెత్తకుండా ఇలాంటి సినిమాకా జాతీయ అవార్డు ఇచ్చేది అంటూ ఫైర్ అయ్యారు. మంచి సినిమాలంటే కె.విశ్వనాథ్ గారి సినిమాలని చెప్పుకొచ్చారు. ఓ జర్నిలిస్ట్ కూడా `పుష్ప`కు గానూ అల్లు అర్జున్‌కు జాతీయ పురస్కారం రావడంపై కామెంట్ చేశారు. బన్నీకి జాతీయ అవార్డు రావడం ఓ వింత అంటూ సెటైర్లు వేయడంతో ఈ పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.