Satthigani Rendekaralu Teaser: పుష్ప కేశవ మెయిన్ లీడ్ లో ‘సత్తిగాని రెండెకరాలు’
Satthigani Rendekaralu Teaser: పుష్ప ఫేం కేశవ (జగదీష్) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సత్తిగాని రెండెకరాలు’ ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ బ్యానర్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన పెద్ద సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ఈ బ్యానర్ పై ఓటీటీ సినిమాలను నిర్మించడం కూడా మొదలైంది.
తాజాగా ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ప్రేక్షకులను టీజర్ ఎంతగానో ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డార్క్ కామెడీగా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. అత్యవసరంగా 25 లక్షలు సత్తి కి అవసరం అవుతాయి. దాంతో తనకున్న రెండెకరాల భూమిని అమ్మేయాలని అనుకుంటాడు. ఇక డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక దొంగతనం చేయాలని అతనికి ఆఫర్ వస్తుంది..అంతలోనే ట్విస్టులతో మిగతా పాత్రలను పరిచయంచేసారు. అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుకుంటాడు..చివరికి ఏమవుతుంది ..? అనే సస్పెన్స్ టీజర్ లో క్రియేట్ అయింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.