‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ పరుశురామ్ మహేష్ ని నెవర్ బిఫోర్ గా ప్రెజెంట్ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేసేశారు. ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది.
తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ‘సర్కారు వారి పాట’ సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ ఈవెంట్ తో మహేష్ అభిమానులకి మాస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో చూడాల్సిందే.