సర్కారు వారి పాట.. వెపన్స్ లేని వేట
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం విదితమే.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.’సరా సరా సరా సరా సర్కారు వారి పాట.. షురూ షురూ అన్నాడు రా అల్లూరి వారి బేటా’ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫాస్ట్ బీట్ ట్యూన్ చేంజ్ కంపోజ్ చేసారని అర్థం అవుతుంది. ఇక ఈ పాట లో మహేష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఫుల్ ఎనర్జీతో సాగిన ఈ పాటను సింగర్ హారిక నారాయణ్ హై పిచ్ వాయిస్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.