‘సర్కారు వారి పాట’ సినిమా రివ్యూ.. ఆడియెన్స్ పాయింటాఫ్ వ్యూ..
రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సర్కారు వారి పాట’ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పిక్చర్ చూసినవాళ్లు అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది ‘బెస్ట్ మూవీ’ అని వెంకీ రివ్యూస్ అనే ట్విట్టర్ అకౌంట్ లో రాశారు. ఫస్టాఫ్ లో ఎంటర్టైనింగ్ సీన్లు అలరించాయని, మ మ మహేష్ అనే పాట, కొన్ని సీక్వెన్స్ బాగున్నాయని వెల్లడించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘సర్కారు వారి పాట’ పూర్తిగా సూపర్ స్టార్ వన్ మ్యాన్ షో అని తేల్చిచెప్పాడు. 5కి 2.75 రేటింగ్ ఇచ్చాడు. ఫైట్లతోపాటు కొన్ని సన్నివేశాల్లో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయిందని తెలిపాడు. మహేష్ అన్న గతంలో ఎప్పుడూ కనిపించనంత స్టైల్ గా ఈ సినిమాలో ఉన్నాడని షోలే అనే పేరుతో ట్విట్టర్ ఖాతా ఉన్న నెటిజన్ రాశాడు. థమన్ మ్యూజిక్ తో మహేష్ బాబు ఇంట్రడక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉందని మధుకర్ దొప్పలపూడి అనే ప్రేక్షకుడు తెలిపాడు. ‘ఇది కదా కావాల్సింది. దీనికోసమే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా వెయిటింగ్’ అని చెప్పాడు. ‘వాట్ ఏ కమ్ బ్యాక్. మహేష్ బాబు ఎనర్జీ అమేజింగ్. రొమ్యాన్స్, కామెడీ టైమింగ్ వావ్’ అని మధుసూదనన్ వరదరాజులు అనే వ్యక్తి తెలిపాడు.