Samantha:టాలీవుడ్ క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న సమంత ఈ మధ్య కాస్త రేస్‌లో వెనకబడింది. మయో సైటీస్ కారణంగా కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సామ్ ఇటీవలే కోలుకుంది. `యశోద` సినిమా రిలీజ్ టైమ్‌లో డబ్బింగ్ చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించిన సమంత అప్పటి నుంచి ప్రత్యేక చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది.
Samantha:టాలీవుడ్ క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న సమంత ఈ మధ్య కాస్త రేస్‌లో వెనకబడింది. మయో సైటీస్ కారణంగా కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సామ్ ఇటీవలే కోలుకుంది. `యశోద` సినిమా రిలీజ్ టైమ్‌లో డబ్బింగ్ చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించిన సమంత అప్పటి నుంచి ప్రత్యేక చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. సోషల్ మీడియాలోనూ ఇటీవల యాక్టీవ్‌గా ఉంటున్న సమంత తన స్నేహితురాలితో కలిసి ఇండోనేసియా బాలీకి ప్రత్యేకంగా వెకేషన్‌కు వెళ్లడం, అక్కడి అందాలని ఆస్వాదిస్తూ పలు ఫోటోలు, వీడియోలని అభిమానులతో పంచుకోవడం తెలిసిందే.
ఇదిలా ఉంటే సమంత నటించిన తాజా చిత్రం `ఖుషీ`. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న సమంత స్టేజ్‌పై లైవ్ పెర్ఫార్మెన్స్ చేయడం వైరల్‌గా మారింది.
ఆ తరువాత ఇతర ప్రమోషన్స్‌లో పాల్గొనని సామ్ ఇటీవల న్యూయర్క్ లో నిర్వహించిన ఇండిపెండెన్స్ పెరేడ్లో పాల్గొంది. అక్కడి వీధుల్లో ప్రముఖులతో కలిసి సందడి చేసింది. అందంగా ముస్తాబై న్యూయార్క్ వీధుల్లో సామ్ కను విందు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ స్టా స్టోరీస్‌లో సమంత షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సామ్ షేర్ చేసిన పోస్ట్‌లో ఇంతకీ ఏ ముంది?.. ఎందుకు వైరల్ అవుతోంది? అని నెటిజన్లు ఆరాతీస్తున్నారు.
సామ్ షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీస్‌లో ఏముందంటే…`మీకు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లే ఛాన్స్ వచ్చినా..నడిచే ఛాన్స్ వచ్చినా.. ఒంటరిగా ప్రయాణించే ఛాన్స్ లభించినా..బ్రతికే ఛాన్స్ వచ్చినా.. డాన్స్ చేసే అవకాశం లభించినా చేసేయండి. ఈ సమాజం నిన్ను నిన్నులా అంగీకరించకపోతే..అలా ఒంటరిగా ప్రయాణించు. నిన్ను నువ్వు అన్వేషించుకో..పక్కన ఎవరైనా ఉన్నప్పుడే తన గురించి తాను తెలుసుకుంటూ ఉంటారు. కానీ మీరు కూడా ఆ కేటగిరీలో పడకండి. మీకు ఒంటరిగా నడిచే ఛాన్స్.. బ్రతికే ఛాన్స్ వస్తే మాత్రం బతికేయండి. అప్పుడే మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది… తెలుస్తుంది` అని పోస్ట్ చేసింది. ఇప్పడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Samayam New Post